3, జూన్ 2009, బుధవారం

ప్రేరణ


ఓం సాయి రాం

బ్లాగు కేవలము సాయిబాబా ఆశ్శీసులతో వ్రాయబడినది. సాయిబాబా భక్తులు ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏక్కువగా వుండెదరు. చాలామంది ప్రతిరోజు ఒక్క అధ్యాయము చదవేవాళ్ళను చాలా మందిని చూసాను. కాని వారు ఎక్కడ వున్నను , ఇబ్బంది లేకుండా చదువుకుంటారనే ముఖ్యఉద్దేశముతో బ్లాగు ను ప్రారంభించబడినది.నేను కూడ అందరివలే సాయిబాబా క్తున్ని, కాని ముఖ్యముగా ఆతి పవిత్ర గ్రంధమైన "శ్రీ సాయి సచ్చరిత్రము " ను ఈ విధంగా తెలుగు బ్లాగు చేయవలెననే ఆలోచన ఈమధ్యనే కలిగింది. ఇది కేవలము బాబా నాకు ప్రసాదించిన గొప్ప వరముగా భావించి ఈ బ్లాగు ప్రారంభించబడినది.


మా గురువర్యులు నాకు ఏప్పుడు ఈవిధంగా చెబుతూవుంటారు,సాయిబాబా వున్నారు. మనమధ్యనే వున్నారు. ఆయనను నమ్మితే, నీ నీడై నిన్ను నడిపించుననేవారు, ఈ బ్లాగును,నా భక్తిని పెంపొందించుటకు ఎంతో కృషి చేసిన నా గురువర్యులు అయిన శ్రీ గోపాల్ రెడ్డి గారికిని మరియు నా తల్లిదండ్రులకును పాదాభివందనములతో అకింతము చేయుచున్నాను. నాలోని భక్తిని దినాదినాబివృద్ధిగా పెంపొందడానికి ఎంతో కృషి చేసిన నా గురువర్యులకు నేనే ఎంతో రుణపడియున్నాను. కేవలము ఆయన మీద వున్న అత్యంత అభిమానము తో అతని పోటోను ఇక్కడ జతపరచబడినది. ఆయన చెప్పిన అడుగుజాడలలో నేను నడవాలని, ఆ శక్తిని బాబా నాకు ప్రాసాదించవలెనని ఆయనును ప్రార్థించుతూ ఈ పుటమును ముగించుచున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి